కాంగ్రెస్ మహిళా పదవికి ఒకె: జీవిత

గత కొంత కాలంగా రాజశేఖర్, జీవిత దంపతులు కాంగ్రెసుకు దగ్గరైన విషయం తెలిసిందే. చిరంజీవితో జరిగిన గొడవలోనూ ఈ కోణం ఉంది. ఇటీవల జీవిత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిశారు. రాజశేఖర్ హీరోగా వస్తున్న సత్యమేవ జయతే సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. అందుకు రాజశేఖర రెడ్డి అంగీకరించినట్లు సమాచారం. రాజశేఖర్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు తరఫున పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications