కాంగ్రెసుతో జత కట్టం: రాఘవులు

అవినీతికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పరస్పరం చేసుకున్న ఆరోపణలపై విచారణ జరిపించాలని తాము డిమాండ్ చేశామని ఆయన చెప్పారు. తమవారిపై కూడా విచారణ జరిపించాలని తాము అన్నామని, తమ పార్టీలో అవినీతిపరులను ఉంచుకోబోమని, అలా ఉంచుకుంటే పార్టీకి నష్టమని ఆయన అన్నారు. విషయం మంచిదా, చెడ్డదా అనేది ముఖ్యమని ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండుపై అన్నారు. తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. తెలంగాణ వస్తుందా, రాదా అనేది తాను చెప్పలేనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గడువులు పెట్టినవారున్నారని, మళ్లీ కొత్త గడువు పెడతారేమో తెలియదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications