అక్రమాస్తుల హౌసింగ్ మధుసూదన్
అనంతపురం: అనంతపురం హౌసింగ్ కార్పోరేషన్ ఎఇ మధుసూదన్ రెడ్డి ఇంటిలో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో మధుసూదన్ రెడ్డికి సంబంధించిన అస్తులను పెద్ద యెత్తున కనుక్కున్నారు. ఇందిరమ్మ పథకం అమలులో అక్రమాలకు పాల్పడి పెద్ద యెత్తున ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో మధుసూదన్ రెడ్డి ఇంటిపై చారు సిన్హా నాయకత్వంలోని ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు.
ఈ సోదాల్లో 50 లక్షల రూపాయలకు పైగా నగదు, బంగారం, నగదు బయటపడ్డాయి. ఇళ్లకు, ప్లాట్లకు సంబంధించిన 30 పత్రాలను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు బ్యాంకు లాకర్లు కూడా ఉన్నాయని ఎసిబి అధికారులు చెప్పారు. వాటిని తెరిస్తే మరిన్ని వివరాలు బయటపడవచ్చునని వారన్నారు. అయితే ఇవన్నీ తాను సక్రమంగా సంపాదించినవేనని మధుసూదన్ రెడ్డి అంటున్నారు.












Click it and Unblock the Notifications