బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో సిపిఐ (ఎం)కి షాక్
నందిగ్రామ్: తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాళ్ లోని కల్లోల ప్రాంతం నందిగ్రామ్ పంచాయతి ఎన్నికల్లో వామపక్ష పార్టీ సిపిఐ (మార్క్సిస్టు) ని ఓడించి దానికి పెద్ద షాక్ ఇచ్చింది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా సిపిఐ ని దురదృష్టం పలకరించింది. ఈ ఫలితాలు వ్యవసాయ భూముల్ని సెజ్ లకి కేటాయించే బుద్దదేవ్ భట్టాచార్య ప్రభుత్వాని విధానానికి ప్రజల జవాబు. కల్లోల ప్రాంతం నందిగ్రామ్ ఉన్న తూర్పు మిడ్నపూర్ లో జరిగిన జిల్లాపరిషత్ ఎన్నికల్లో ఫలితాలు ప్రకటించిన 53స్దానాల్లో 32 స్దానాల్ని తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది. తృణమూల్ కాంగ్రెస్ జిల్లా పరిషత్ స్దానాల్ని గెలవడం ఇదే మొదటిసారి. 2003 ఎన్నికల్లో తృణమూల్ రెండు సీట్లను మాత్రమే గెలిచింది. ఇంతకుముందెప్పుడూ పంచాయతీ ఎన్నికల్లో పారిశ్రామికీకరణ ప్రధానాంశం అవలేదు. అదీ నందిగ్రామ్, సింగూర్ లలో అసలే అవలేదు.ఇతర జిల్లాల్లో మాత్రం వామపక్షాలు లీడింగ్ లో ఉన్నా కాంగ్రెస్ గట్టి పోటీనిస్తుంది. మూడంచెల పంచాయతీ వ్యవస్దకు ఎన్నికలు మే 11,14, 18 న జరిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications