సింగరేణి కాలనీలో గుడిసెల దగ్ధం
హైదరాబాద్: హైదరాబాదులోని సైదాబాదులో గల సింగరేణి కాలనీలో బుధవారం పేదల గుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. వందకు పైగా గుడిసెలు మంటల్లో కాలిపోవడంతో ప్రజలు దిక్కు తోచక హాహాకారాలు చేశారు. ఈ కాలనీలో గతంలో కూడా పలుమార్లు అగ్నిప్రమాదాలు సంభవించాయి. వీటి పక్కన ప్రభుత్వం పెద్దలకు భవంతులు నిర్మించి ఇచ్చింది. గుడిసెలు కాలిపోవడం వెనక కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బాధితులను పరామర్శించడానికి కలెక్టర్ నవీన్ మిట్టల్ సంఘటనా స్థలానికి వచ్చారు. కలెక్టరును బాధితులు ఘెరావ్ చేశారు. బాధితులను ఆదుకుంటామని ఆయన చెప్పారు. బాధితులకు కమిటీ హాల్లో వసతి ఏర్పాటు చేశారు. ఒక్కో కుటుంబానికి 20 కిలోలేసి బియ్యం, 2 వేల రూపాయలేసి నగదు ఇవ్వనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications