ఇంటి దొంగల ప్రమాదం: కెసిఆర్

వాల్మీకీ, బోయలు, మాలీలు, మధిరులు ఆంధ్రప్రాంతంలో ఎస్టీలు కాగా తెలంగాణలో బిసిలని, ఈ పరిస్థితి మారాలంటే తెలంగాణ రాష్ట్రం రావాల్సిందేనని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసుకు బుధ్ది చెప్పి ఢిల్లీ మెడలు వంచాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టడానికి, కాంగ్రెసు మెడలు వంచడానికి, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అహంకారాన్ని దించడానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్దేశ్యపూర్వకంగా ఈ ఉప ఎన్నికలను తామే తెచ్చామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కొమురం భీం జన్మించిన కెరిమెరిని ప్రత్యేక ప్యాకేజీతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications