భవిష్యత్తు వామపక్షాలదే: నారాయణ
హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయ శక్తుల పునరేకీకరణ తథ్యమని, ఇందులో వామపక్షాలదే కీలక పాత్ర అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. భవిష్యత్తు రాష్ట్ర రాజకీయాల్లో వామపక్షాలదే కీలక పాత్ర అని ఆయన బుధవారం మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో చెప్పారు. జూన్ 17వ తేదీ నుంచి మళ్లీ భూపోరాటం చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణకు తాము అనుకూలమేనని, దానిపై కమిటీ వేశామని తెలుగుదేశం పార్టీ అంటోందని, తెలంగాణ ప్రజల సెంటిమెంటును గుర్తిస్తున్నామని, అయితే తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని సిపిఎం కార్యదర్శి బి.వి. రాఘవులు అంటున్నారని, ఈ పార్టీలు ఈ అయోమయాన్ని వీడాల్సి ఉంటుందని ఆయన అన్నారు. భవిష్యత్తులో అన్ని పార్టీలు ఒక స్పష్టతకు వచ్చి రాజకీయ శక్తుల పునరేకీకరణ జరుగుతుందని ఆయన చెప్పారు.
ఉప ఎన్నికల్లో తాము పోటీ చేస్తున్న రెండు స్థానాల్లో సిపిఐ గెలిస్తే తెలంగాణ వాదం జాతీయ స్థాయిలో వినబడుతుందని ఆయన అన్నారు. రాజకీయ విధానాల కన్నా ఆర్థిక విధానాలే ముఖ్యమని ఆయన అన్నారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తులను తప్పకుండా ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థులు ఓడిపోతే తెలంగాణవాదానికి ఏ విధమైన నష్టం జరగదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications