ఘరానా మోసం: రియల్టర్ అరెస్టు
హైదరాబాద్: లేని భూమిని అమ్మి ప్రజలను మోసం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారిని పోలీసులు బుధవారంనాడు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో సూర్య రియల్ ఎస్టేట్ కంపెనీ పేరు మీద ప్రజలను మోసం చేసిన కట్టా మనోజ్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి పోలీసులకు చిక్కాడు. అతనిపై 145 కేసులున్నాయని, వీటిలో 105 హయత్ నగర్ పోలీసు స్టేషనులోనూ, 40 కేసులు సరూర్ నగర్ పోలీసు స్టేషనులోనూ ఉన్నాయి.
లేని భూమిని అమ్ముతూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి 40 కోట్ల రూపాయల మేరకు అతను మోసానికి పాల్పడినట్లు సమాచారం. ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనోజ్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతని చేతిలో దాదాపు 1500 మంది మోసపోయారు.












Click it and Unblock the Notifications