కెసిఆర్ లో అభద్రత భావం: మొయిలీ

రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత లక్ష్యం కోసం కెసిఆర్ ఉప ఎన్నికలు తెచ్చారని ఆయన విమర్శించారు. 2009లో సాధారణ ఎన్నికలు వస్తుండగా ఇప్పుడు ఉప ఎన్నికల అవసరం ఏమిటని ఆయన అడిగారు. కెసిఆర్ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఇది వరకు ఒకసారి కరీంనగర్ లోకసభ ఉప ఎన్నికలను తెచ్చారని, ఇప్పుడు ఈ ఉప ఎన్నికలను తెచ్చారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు దురదృష్టకరమని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి స్పష్టత లేదని ఆయన విమర్శించారు. పొత్తుల విషయంలో ఏ పార్టీతో పోవాలనే విషయంలో తెలుగుదేశం పార్టీలో అయోమయం నెలకొని ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications