కెసిఆర్ కు చిత్తశుద్ధి లేదు: వైయస్

YS Rajasekhar Reddy
వరంగల్: తెలంగాణ పేరుతో పబ్బం గడుపుకోవడానికే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ప్రయత్నిస్తున్నారని, తెలంగాణపై కెసిఆర్ కు చిత్తశుద్ది లేదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి విమర్శించారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలోని పరకాల, ములుగు, వెంకటాపురం తదితర ప్రాంతాల్లో ఆయన బుధవారం రోడ్ షో నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు కెసిఆర్ తెలంగాణ పదం కూడా ఉచ్చరించలేదని ఆయన అన్నారు. ఉప ఎన్నికల వల్ల ప్రజలపై భారం పడిందని, ఇందుకు కారణమైనవారిని ప్రజలు ఓడించాలని ఆయన అన్నారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రకటించలేకపోతున్నానని ఆయన చెప్పారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెసుకు మాత్రమే ప్రజలను ఓటు అడిగే హక్కు ఉందని ఆయన అన్నారు. తెలంగాణ అంశాన్ని రాజకీయం చేస్తూ తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. గత నాలుగేళ్లలో కాంగ్రెసు ప్రభుత్వం చేసిన మేళ్లను ఆయన వివరించారు. పరకాలలో రాజీవ్ గాంధీకి ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. దేవాదుల పైపులైన్లను పరిశీలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+