2009 ఎన్నికలకు నాంది: బాబు

తన సొంత ప్రాంతం ఇడుపులపాయలకు 12000 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రైల్వే లైన్ వేయించుకున్నారని, ఆ నిధులను ఆదిలాబాదు జిల్లాకు ఖర్చు పెడితే ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని ఆయన అన్నారు. ఆదిలాబాదు జిల్లాను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ముడుపులకు అమ్ముడుపోతున్నారని ఆయన అన్నారు. మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని, యువతకు వేయి రూపాయలేసి నిరుద్యోగ భృతి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆరు నెలలు పోతే తమ ప్రభుత్వం వస్తుందని, ప్రజల కష్టాలన్నీ తీరుతాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications