విశాఖ కలెక్టరేట్ కు సిపిఐ తాళాలు
విశాఖపట్నం: విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయానికి సిపిఐ కార్యకర్తలు గురువారం తాళాలు వేశారు. స్వాతంత్ర్య సమరయోధుడికిచ్చిన భూమిని కలెక్టర్ కాపాడలేకపోయారని, 10 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని, భూకబ్జాదారులకు వారు కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తూ సిపిఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో భాగంగా వారు కలెక్టర్ కార్యాలయానికి తాళం వేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
అదే సమయంలో భూముల వేలాన్ని అడ్డుకోవడానికి తెలుగుదేశం, సిపిఎం కార్యకర్తలు ప్రయత్నించారు. వేలం జరుగుతున్న స్థలాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు. దాదాపు 70 ఎకరాల భూముల వేలానికి ఉడా ఒడిగట్టింది. అయితే సిపిఎం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు భూమి లేదని వేరే ప్రాంతానికి తరలించిన ప్రభుత్వం ఉన్న భూములను వేలం వేస్తోందని ఆందోళనకారులు విమర్శించారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.












Click it and Unblock the Notifications