బెజవాడలో భార్య గొంతు కోసిన భర్త
విజయవాడ: విజయవాడలో నాగరాజు అనే వ్యక్తి భార్య జయలక్ష్మి గొంతు కోశాడు. గురువారంనాడు విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించింది. కాపురానికి రావడం లేదంటూ ఆగ్రహించిన నాగరాజు ఈ దారుణానికి ఒడిగట్టాడు. జయలక్ష్మి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జయలక్ష్మి ప్రవర్తన మంచిది కాదని, అందుకే గొంతు కోశానని నాగరాజు అంటున్నాడు. వేరే వ్యక్తితో తన భార్య జయలక్ష్మి అక్రమ సంబంధం పెట్టుకుందని అతను అంటున్నాడు. తమ ఇద్దరు పిల్లలు తన వద్దనే ఉంటున్నారని, కాపురానికి రమ్మంటే రావడం లేదని అతను చెబుతున్నాడు.












Click it and Unblock the Notifications