కప్పట్రాళ్ల హత్య: ప్రత్యక్ష సాక్షి మృతి
కర్నూలు: తెలుగుదేశం నాయకుడు కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వీరాస్వామి గురువారం మరణించాడు. దీంతో బాంబు దాడిలో మృతుల సంఖ్య 11కు పెరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడిన వీరాస్వామితో పాటు రంగన్న అనే ప్రత్యక్ష సాక్షులను ప్రభుత్వాస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. వీరాస్వామి పోలీసులకు వాంగ్మూలం కూడా ఇచ్చాడు. మద్దిలేటి నాయుడు లారీ కప్పట్రాళ్ల వాహనాన్ని ఢీకొట్టిందని, ఆ తర్వాత కప్పట్రాళ్లను వేటకొడవళ్లతో, ఇతర మారణాయుధాలతో నరికి చంపారని, బతిమిలాడుతున్నా కూడా అంగరక్షకుడు రాములును వదలలేదని అతను చెప్పాడు.
అయితే వీరస్వామి ఆరోగ్యం క్షీణించిందంటూ వీరాస్వామిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వీరాస్వామి మరణించాడు. మరో ప్రత్యక్ష సాక్షి రంగన్న పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అతను అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. రంగన్నను బతికించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని వైద్యులు చెప్పారు.












Click it and Unblock the Notifications