జెసి అనుచరులకు బెదిరింపులు
అనంతపురం: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి వర్గీయులను బెదిరిస్తూ పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి అనుచరుడు నారాయణ రెడ్డి పేర మీడియాకు ఒక లేఖ అందింది. జైలు నుంచి సూరి విడుదలకు మంత్రి దివాకర్ రెడ్డి అడ్డు పడుతున్నారని నారాయణ రెడ్డి ఆ లేఖలో రాశాడు. అందుకు జెసికి గుణపాఠం చెబుతామని అతను హెచ్చరించాడు. జెసి వర్గీయులు చందు, ప్రకాశ్ లను హెచ్చరిస్తూ అతను లేఖ రాశాడు.
అయితే, సూరి వర్గీయుల బెదిరింపులకు భయపడబోమని చందు, ప్రకాశ్ అంటున్నారు. జైలు నుంచి సూరి వర్గీయులు లేఖ రాశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని వారన్నారు. తమ ప్రాణాలకు సూరి వర్గం నుంచి ప్రాణభయం ఉందని, తగిన రక్షణ కల్పించాలని వారంటున్నారు. ఈ విషయాన్ని మంత్రి జెసి దివాకర్ రెడ్డి హోంమంత్రి కె. జానారెడ్డి దృష్టికి తీసికెళ్లే అవకాశం ఉంది. ఆ మధ్య పెనుగొండ, రాప్తాడు ప్రాంతాల్లో నాయకత్వం వహిస్తున్న నారాయణరావు యాదవ్ హత్యకు గురయ్యాడు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications