కప్పట్రాళ్ల హత్య: వీరాస్వామి బ్రెయిన్ డెడ్
కర్నూలు: తెలుగుదేశం నాయకుడు కప్పట్రాళ్ల హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వీరాస్వామి మృతి చెందలేదని వైద్యులు అంటున్నారు. వీరాస్వామి బ్రెయిన్ డెడ్ అయిందని వారు చెప్పారు. అతను అపస్మారక స్థితిలో ఉన్నాడు. వీరాస్వామికి కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. అయితే అతను బతికే అవకాశాలు తక్కువ అని అంటున్నారు. వీరాస్వామి కంటికి కుడి పక్కన తీవ్రమైన గాయం అయింది. అదే విధంగా ఊపిరితిత్తులకు కూడా గాయమైందని అంటున్నారు.
వీరాస్వామి మరణించాడని ప్రకటించి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసుల ప్రకటనతో వీరాస్వామి మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. కప్పట్రాళ్ల హత్యకేసులో మరో ప్రత్యక్ష సాక్షి రంగన్న కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పారు. కప్పట్రాళ్ల హత్యకు మద్దిలేటి నాయుడే కారణమని వీరస్వామి ఇంతకు ముందు చెప్పాడు.












Click it and Unblock the Notifications