అన్నమయ్య వారసులకు పింఛన్లు: వైయస్

YS Rajasekhar Reddy
కడప: పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య వారసులకు నెలకు ఐదు వేల రూపాయలేసి పింఛను ఇవ్ననున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రకటించారు. తాళ్లపాకలో జరుగుతున్న అన్నమాచార్య జయంతి ఉత్సవాల్లో ఆయన గురువారం నాడు పాల్గొన్నారు. అన్నమయ్య వారుసులు 12 మంది దాకా ఉన్నారని అంటున్నారని, వారికి జీవిత కాలం ఐదు వేల రూపాయలేసి పింఛను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఇస్తుందని ఆయన చెప్పారు. వారికి ఇళ్లు కట్టించే ఏర్పాటు కూడా చేస్తామని ఆయన చెప్పారు.

రాజంపేట రూరల్ మండలానికి అన్నమయ్య పేరు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఒకటి, రెండు కోట్ల రూపాయలతో అన్నమయ్య టౌన్ షిప్ ఏర్పాటు చేస్తామని కూడా ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫిసర్ రమణాచారి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గురువారం నుంచి రెండు రోజుల పాటు తన సొంత కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. బుధవారం వరకు ఆయన ఉప ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+