విదేశీ గడ్డపై (అమెరికాలోని డెట్రాయిట్) మొట్టమొదటి ప్రొ తెలుగు సమావేశాన్ని నిర్వహించి పక్షం రోజులుకూడా గడవకుండానే కెనడాలో సమావేశాన్ని నిర్వహిస్తూ మరో మైలు రాయి దిశగా ప్రొ తెలుగు శరవేగంతో పయనిస్తుంది. మరో సంచలన విషయం ఏమిటంటే ప్రొ తెలుగు అమెరికాలోని నాలుగు జిల్లాల్లో (కొలంబస్, డల్లాస్, చికాగో, అట్లాంటా), కెనడాలో ఒకేరోజు,ఒకేసమయానికి ఐదు సమావేశాల్ని నిర్వహించబోతుంది. అన్ని సమావేశాలు ఒకే సమయానికి ప్రారంభమై ఒకే సమయంలో ముగించబడతాయి. 'టెలికాన్' వారది గా వీడియో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వక్తలు భారత్ నుండే సమావేశాలకు హాజరైనవారినుద్దేశించి ప్రసంగిస్తారు. " సమావేశాలన్నింటికి కలిపి కొన్ని వందలు లేదా వేల సంఖ్యలో జనం హాజరవచ్చని అంచనా వేస్తున్నాం. తొందర్లోనే మలేషయా, యు.కె., ఆస్ట్లేలియాల్లో సమావేశాల్ని నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నామని" ప్రొ తెలుగు ఆర్గనైజేషన్ మీడియా కార్యదర్శి శ్రీ రావు సిద్దాం అన్నారు.