హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై తెలుగు నిర్మాతల మండలి నిషేధం విధించింది. సినిమా షూటింగులకు డుమ్మా కొడుతుండడంతో ప్రకాష్ రాజ్ పై తెలుగు నిర్మాతల మండలికి పలు ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రకాష్ రాజ్ పై నిర్మాతల మండలి నిషేధం విధించింది. ప్రకాష్ రాజ్ ను ఎవరూ తీసుకోవద్దని, ఒక వేళ తీసుకుంటే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని మండలి తెలియజేసింది.
దాంతో పాటు ఈ విషయమై నిర్మాతల మండలి ఒక కమిటీని వేసింది. ప్రకాష్ రాజ్ షూటింగులకు ఆలస్యంగా రావడం, కాల్షీట్స్ విషయంలో సరిగా వ్యవహరించకపోవడం వంటి చర్యలతో నిర్మాతలకు తలనొప్పిగా మారారని గతంలో కూడా ఫిర్యాదులు అందాయి.