ఎత్తుగడల రీత్యా విజయం: కెసిఆర్

సంస్థాగత లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. కొన్ని పద్ధతులు, పద్ధతులను మార్చుకుంటే సరిపోతుందని మేధావులు అంటున్నారని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో కొంత వైఫల్యానికి నిర్లిప్తత కారణమని ఆయన అన్నారు. రాజీనామాలు చేయాలనేది ఒక్క కెసిఆర్ ఆలోచన కాదని, మేధావుల అభిప్రాయం తీసుకున్నామని, ప్రజల అంగీకారం తీసుకున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ వ్యతిరేక శక్తులను, వ్యక్తులను ప్రజాకోర్టుకు లాగాల్సిందేనని ప్రజలు అన్నారని, ఆ మేరకే రాజీనామాలు చేసి ఉప ఎన్నికలను ఆహ్వానించామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications