అరెస్టులో మా జోక్యం లేదు: ఆనం
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకుడు కె. శ్రీనివాస్ అరెస్టు వెనక ప్రభుత్వ జోక్యం లేదని సమాచార, పౌరసంబంధాల మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి చెప్పారు. జర్నలిస్టుల అరెస్టులతో ప్రభుత్వానికి సంబంధం లేదని ఆయన చెప్పారు. జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలేవీ లేవని ఆయన అన్నారు. కె. శ్రీనివాస్ తో పాటు మరో ఇద్దరు జర్నలిస్టుల అరెస్టు సంఘటనపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి బుధవారం ఆనం వివేకానంద రెడ్డితో చర్చలు జరిపారు.
శ్రీనివాస్ పై కేసు వివరాలను హైదరాబాద్ పోలీసు కమీషనర్ ప్రసాదరావు ముఖ్యమంత్రికి అందజేశారు. హోం మంత్రి కె. జానారెడ్డి ప్రజా గాయకుడు గద్దర్ తో చర్చలు జరిపారు. ఇరు వర్గాల మధ్య సయోధ్యకు జానారెడ్డి తాను చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గద్దర్ తో మాట్లాడినట్లు సమాచారం. కాగా, శ్రీనివాస్ అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళనలకు దిగారు. హైదరాబాదులో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు.












Click it and Unblock the Notifications