హైదరాబాద్: ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ ను అరెస్టు చేసిన పోలీసులు బుధవారం చంచల్ గుడా కు తరలించారు. శ్రీనివాస్ ను మంగళవారం రాత్రి పదిన్నరకు అదుపులోకి తీసుకున్న పోలీసులు లాకప్ లో ఉంచి బుధవారం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ పై ఎస్ సి, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంకింద కేసును నమోదు చేశారు. ఈ చట్టం కింద కేసుల్లో సాధారణంగా బెయిల్ లభించదు. ఆంధ్రజ్యోతి యాజమాన్యం బుధవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.