ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు: బాబు

జర్నలిస్టుల అరెస్టుకు నిరసనగా చంద్రబాబు రాస్తారోకోలో పాల్గొన్నారు. పలాస వద్ద జర్నలిస్టులు నిర్వహించిన రాస్తారోకోలో ఆయన పాల్గొన్నారు. జర్నలిస్టుల అరెస్టును తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. ఎర్రంనాయుడు కూడా ఖండించారు. అరెస్టులపై ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అరెస్టయిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఆందోళనకు తమ మద్దతు కొనసాగుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications