ఉద్యమానికి ఊపు: దేవేందర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఊపందుకుంటుందని టి. దేవేందర్ గౌడ్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి రాజీనామా చేసిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వి. ప్రకాష్ బుధవారం దేవేందర్ తో కలిశారు. తెలుగుదేశం పార్టీ కార్యదర్శి స్వామినాథన్ కూడా దేవేందర్ గౌడ్ పక్షంలో చేరారు. తెలంగాణ ఉద్యమానికి త్వరలో విధివిధానాలను ఖరారు చేస్తామని ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో తన ఆశయం అడియాసే అయిందని వి. ప్రకాష్ చెప్పారు. తెరాస చౌరస్తాలా మారిందని ఆయన విమర్శించారు. వచ్చేవాళ్లు వస్తున్నారు, వెళ్లేవాళ్లు వెళ్తున్నారని, వచ్చినవాళ్లు ఉండడం లేదని ఆయన అన్నారు. వచ్చినవారిని ఎందుకు కాపాడుకోలేకపోతున్నారో అర్థం కాలేదని ఆయన అన్నారు. తన మనసు గాయమైందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications