సగం కాలిన నాలుగు మృతదేహాలు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మేడ్చెల్ రైల్వే ట్రాక్ సమీపంలో నాలుగు సగం కాలిన మృతదేహాలు బయటపడ్డాయి. ఇందులో రెండు మహిళల శవాలు కాగా, మరో రెండు పురుషులవి. వారి వయస్సు 30 ఏల్ల లోపే ఉంటుందని భావిస్తున్నారు. శవాలు పడి ఉన్న ప్రాంతం నిర్మానుష్యంగా ఉంటుంది. శవాలు గురువారం ఉదయం పశువుల కాపరుల కంట పడ్డాయి. వారు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.
నలుగురిని మరో చోట హత్య చేసి ఇక్కడికి తెచ్చి ఉంటారని భావిస్తున్నారు. ఇక్కడే శవాలను దగ్ధం చేసినట్లు అనుమానిస్తున్నారు. గురువారం తెల్లవారు జామున మృతదేహాలను ఇక్కడికి తెచ్చి ఉంటారని అనుకుంటున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications