దువ్వాడ అరెస్ట్? స్టేషన్ బయట దివ్వెల మాధురి రచ్చ రచ్చ. హైటెన్షన్!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ సోమవారం కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు దివ్వెల మాధురి కూడా పీఎస్‌కు వచ్చారు. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు నమోదైన కేసుతో పాటు, హిరమండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని మరో కేసులో పోలీసుల నుంచి నోటీసులు అందడంతో ఆయన ఇక్కడకు విచారణకు వచ్చారు. అయితే విచారణ అనంతరం దువ్వాడ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారనే వార్తలు వ్యాపించడంతో కొత్తూరు పోలీస్ స్టేషన్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దువ్వాడ శ్రీను అరెస్ట్ అవుతున్నారనే సమాచారంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున కొత్తూరు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. దివ్వెల మాధురితో పాటు వారంతా పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పెరగడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసనల మధ్యే దువ్వాడ శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

మంత్రి అచ్చెంనాయుడ ఆరోపణలు..
పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యే ముందు దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి అచ్చన్నాయుడిపై రూ. 75 కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయని, పీడీఎస్ (PDS) రేషన్ బియ్యం అక్రమాలకు సంబంధించి తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని, ఆ ఆధారాలతోనే తాను ఆరోపణలు చేస్తున్నానని స్పష్టం చేశారు. దువ్వాడ శ్రీనివాస్ విచారణ, తదనంతర పరిణామాలతో శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.














Click it and Unblock the Notifications