తెరాసకు మల్యాల రాజయ్య రాజీనామా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మల్యాల రాజయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు బాదన్న కూడా పార్టీకి రాజీనామా చేశారు. వీరితో పాటు మరికొంత మంది స్థానిక నాయకులు ఆ పార్టీలకు రాజీనామా చేశారు. వీరంతా టి. దేవేందర్ గౌడ్ చేపట్టే తెలంగాణ ఉద్యమం వైపు మొగ్గు చూపుతున్నారు.
దేవేందర్ గౌడ్ సౌమ్యమైన వ్యక్తి అని మల్యాల రాజయ్య అన్నారు. తాము పాత మిత్రులమేనని, ఇంతకు ముందు కలిసి పని చేశామని ఆయన అన్నారు. ఇప్పుడు దేవేందర్ గౌడ్ తో కలిసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పని చేస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications