కాంగ్రెసుతోనే ఉంటా: అహ్మదుల్లా
కడప: తాను కాంగ్రెసుకు రాజీనామా చేసి చిరంజీవి పార్టీలో చేరబోతున్నట్లు వచ్చిన వార్తలను కడప జిల్లాకు చెందిన శాసనసభ్యుడు అహ్మదుల్లా ఖండించారు. తాను కాంగ్రెసుకు రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలను చూసి కలత చెందినట్లు ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తప్పుడు వార్తలు ప్రసారం చేయడం తప్పని ఆయన అన్నారు.
తాను కాంగ్రెసు పార్టీతోనే ఉంటానని ఆయన చెప్పారు. ఆరోగ్యం బాగా లేక తాను విశ్రాంతి తీసుకుంటున్నానని ఆయన చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, కాంగ్రెసు తనకు తల్లిలాంటిదని, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తనకు రాజకీయ గురువు అని ఆయన చెప్పుకున్నారు.












Click it and Unblock the Notifications