మరో 3 శవాల వెలికితీత
విశాఖపట్నం: మావోయిస్టుల దాడిలో విశాఖపట్నం జిల్లాలోని బలిమెల రిజర్యాయర్ లో గల్లంతయిన పోలీసుల్లో మరో ముగ్గురి శవాలను ఆదివారంనాడు వెలికి తీశారు. దీంతో ఇప్పటి వరకు 26 మంది పోలీసుల శవాలు బయటపడ్డాయి. మరో పది మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఆదివారంనాడు బయటపడిన శవాలు బుచ్చిబాబు, ఎవిబి రెడ్డి, శేఖర్ లవిగా గుర్తించారు.
బలిమెల రిజర్వాయర్ లో మునిగిన లాంచీని వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నారు. అది బురదలో కూరుకుపోవడంతో కష్టమవుతోంది. హెలికాప్టర్లు ఉపయోగించి లాంచీని వెలికి తీయడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో బెలూన్ల ద్వారా దాన్ని వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక్కో బెలూన్ పది టన్నుల బరువు మోయగలుగుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications