వర్గీకరణను తప్పు పట్టలేదు: డిఎస్
హైదరాబాద్: తాను ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకించలేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారు. దళిత, బలహీనవర్గాలు ఐక్యంగా ఉంటే నవ సమాజ స్థాపన జరుగుతుందని తాను అన్నానని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వర్గీకరణ హక్కు అని, అది వేరే విషయమని, దళితులు, బలహీనవర్గాలవారు ఐక్యంగా ఉంటే సాధించే ప్రయోజనాలు వేరే ఉంటాయని ఆయన అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై తాము స్పష్టంగా ఉన్నామని ఆయన అన్నారు.
తాను వర్గీకరణను వ్యతిరేకించినట్లు మాదిగ దండోరా చేసిన విమర్శలో నిజం లేదని ఆయన అన్నారు. శాసనసభ, పార్లమెంటు సీట్లు ఆశించినవారికే పార్టీ పదవులు దక్కుతాయని ఆయన చెప్పారు. ఈ నెల 17వ తేదీన తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకాశం, నెల్లూరు జిల్లాల పర్యటనకు వస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications