సంక్షోభం ఏమీ రాదు: ఎర్రంనాయుడు
శ్రీకాకుళం: తమ పార్టీకి కొంత మంది నాయకులు రాజీనామా చేయడం సంక్షోభానికి దారి తీయదని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. ఎర్రంనాయుడు అన్నారు. రాజకీయాల్లో మార్పులు సంభవిస్తూ ఉంటాయని ఆయన ఆదివారం ఒక ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. తమకేవో అవకాశాలు వస్తాయని కొంత మంది నాయకులు వెళ్తున్నారని, నాదెండ్ల భాస్కరరావు నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది వెళ్లిపోయారని, పార్టీ పటిష్టంగానే ఉందని ఆయన అన్నారు. ఇబ్బందులు రావడం సహజమని, వాటిని పార్టీ అధిగమిస్తుందని ఆయన అన్నారు. తమ పార్టీ నాయకుడు చంద్రబాబు మీకోసం యాత్రకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారని ఆయన అన్నారు.
మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలామ్ అణు ఒప్పందంపై తీసుకున్న వైఖరిని ఆయన తప్పు పట్టారు. అమెరికాతో అణు ఒప్పందాన్ని గతంలో కలామ్ వ్యతిరేకించారని, ఇప్పుడు ఎందుకు సమర్థిస్తున్నారో వివరణ ఇవ్వాలని ఆయన అన్నారు. సమాజ్ వాది పార్టీ వెళ్లిపోవడం వల్ల యుఎన్ పిఎకు జరిగే నష్టం ఏమీ లేదని, యుఎన్ పిఎ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications