సేవలో మహేష్ బాబు ఫ్యాన్స్
హైదరాబాద్: ప్రముఖ హీరో మహేష్ బాబు అభిమానులు సేవారంగంలోకి అడుగు పెట్టనున్నారు. హైదరాబాదులోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్బులో సమావేశమైన కృష్ణ, మహేష్ బాబు అభిమానులు ఆదివారం ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మహేష్ బాబు జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని వారు నిర్ణయించారు. మహేష్ బాబు జన్మదినం ఆగస్టు 9వ తేదీ.
మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ఆగస్టు 2 నుంచి 9వ తేదీ వరకు వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమం, నేత్రదానం, పుస్తకాల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహేష్ బాబు నటించిన సినిమాలను వారం రోజుల పాటు ప్రదర్శిస్తారు.












Click it and Unblock the Notifications