చిరుతోనే మార్పు: నాగబాబు
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి వల్లనే సామాజిక మార్పు సాధ్యమని ఆయన సోదరడు, సినీ నటుడు నాగేంద్రబాబు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలులో ఆయన ఆదివారంనాడు మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. త్వరలోనే చిరంజీవి పార్టీపై ప్రకటన చేస్తారని ఆయన చెప్పారు.
యువతకు తమ సోదురడు పవన్ కళ్యాణ్ సారథ్యం వహిస్తారని ఆయన చెప్పారు. తమ పార్టీలోకి ఎవరైనా రావచ్చునని ఆయన చెప్పారు. చిరంజీవి రాజకీయ ప్రవేశానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి సమానమైన స్పందన లభిస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications