టిడిపికి రామచంద్రయ్య గుడ్ బై?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా కడప జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సి. రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఆయన చిరంజీవి పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఆయన గత రెండు రోజులుగా ఆయన ఎడతెరిపి లేకుండా చిరంజీవి ఆంతరంగికులతో చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు.
రామచంద్రయ్య గత రెండు, మూడు నెలలుగా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. తమ పార్టీ నేత చంద్రబాబునాయుడితో ఆయన అసంతృప్తింగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యాలయానికి కుడా రావడం లేదు. రామచంద్రయ్య పార్టీలో కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మాకినేని పెదరత్తయ్య ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కర్నూలు జిల్లాకు చెందిన భూమా నాగిరెడ్డి దంపతులు పార్టీకి రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications