వర్గీకరణ చేస్తే రాజీనామా: హర్షకుమార్
రాజమండ్రి: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ తీవ్రంగా ప్రతిస్పందించారు. వర్గీకరణ పార్టీ నిర్ణయమే అయితే తాను వ్యతిరేకిస్తున్నానని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదిస్తే తాను రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. తాను పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నందుకు తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసుకోవచ్చునని ఆయన సవాల్ చేశారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే వర్గీకరణ సమస్య ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. వర్గీకరణ చేస్తే పార్టీకి కోస్తాలో నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో కూడా పార్టీ నష్టపోతుందని ఆయన అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ఆయన మొదటి నుంచీ గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు. అదే విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండు












Click it and Unblock the Notifications