గోరింటాకుపై మందకృష్ణ మండిపాటు
హైదరాబాద్: ఇంతకు ముందు ఎన్టీఆర్ జూనియర్ నటించిన కంత్రీ సినిమాపై గుర్రుమన్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నేత మందకృష్ణ మాదిగ తాజాగా రాజశేఖర్ నటించిన గోరింటాకు సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోరింటాకు సినిమాలో వికలాంగులను కించపరిచే విధంగా సంభాషణలున్నాయని ఆయన ఆరోపించారు. ఆ సన్నివేశాలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే చిత్ర దర్శకుడు, నిర్మాత, మాటల రచయిత క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తమ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఏవీ లేవని గోరింటాకు సినిమా దర్శకుడు ప్రతాప్ అన్నారు. సినిమా చూసి అలాంటి సన్నివేశాలు ఉన్నాయని తేలిస్తే వాటిని తొలగించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. అలాగే తాము క్షమాపణ చెప్పడానికి కూడా వెనకాడబోమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications