లెఫ్ట్ పై కాంగ్రెస్ ఎదురుదాడి
న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన చేసిన వెంటనే కాంగ్రెస్ వామపక్షాలపై ధ్వజమెత్తింది. మద్దతు ఉపసంహరణకు వామపక్షాలు ఎంచుకున్న సమయాన్ని కాంగ్రెస్ తప్పు పట్టింది. కాబూల్ లో మరణించినవారికి దేశం సంతాపం ప్రకటిస్తున్న సమయంలో వామపక్షాలు ఆ ప్రకటన చేడయం సరి కాదని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి వీరప్ప మొయిలీ మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. దేశ ప్రతిష్ట కన్నా తమ ప్రతిష్ట ఎక్కువని వామపక్షాలు భావిస్తున్నాయని ఆయన అన్నారు.
యుపిఎకు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన నివాసంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. యుపిఎ ప్రభుత్వానికి ఏ విధమైన ప్రమాదం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ అన్నారు. పార్లమెంటులో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మెజారిటీని నిరూపించుకుంటుందని ఆయన అన్నారు. మన్మోహన్ సింగ్ కొత్త విషయమేమీ చెప్పలేదని, నాలుగున్నర ఏళ్లుగా ప్రధాని అదే విషయం చెబుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications