యుపిఎకు లెఫ్ట్ మద్దతు ఉపసంహరణ
న్యూఢిల్లీ: ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు వామపక్షాలు మంగళవారం ప్రకటించాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ను కలిసి యుపిఎకు మద్దతు ఉపసంహరించుకుంటూ లేఖ అందజేస్తాయి. అణు ఒప్పందంపై ముందుకే సాగుతామని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రకటన చేయడంతో వామపక్షాలు తమ నిర్ణయాన్ని మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రకటించాయి.
నాలుగు వామపక్షాల సమావేశానంతరం సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ తమ నిర్ణయాన్ని వెల్లడించారు. అణు ఒప్పందంపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఎఇహ)కి వెళ్లడం ఖాయమని ప్రధాని ప్రకటించిన తర్వాత మద్దతు కొనసాగించడంలో అర్థం లేదని ఆయన అన్నారు. ఈ నెల పదవ తేదీన తలపెట్టిన యుపిఎ - వామపక్షాల సమన్వయ కమిటీ సమావేశానికి కూడా అర్థం లేదని ఆయన అన్నారు. అణు ఒప్పందంపై ప్రభుత్వం చెప్పిన అబద్ధాలను ప్రజల ముందు ఉంచుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications