న్యూఢిల్లీ: పార్లమెంటులో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే తాము అనుకూలంగా ఓటు చేస్తామని సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ చెప్పారు. అణు ఒప్పందంపై ప్రభుత్వాన్ని బలపరిచే విషయంలో తమ పార్టీలో విభేదాలు లేవని, పార్టీ ఏకతాటి మీద ఉందని ఆయన మంగళవారంనాడు చెప్పారు. పార్టీ పార్లమెంటు సభ్యులు ములాయం సింగ్ నిర్ణయాన్ని బలపరిచారు. యుపిఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే విషయంలో వామపక్షాలు బిజెపితో చేతులు కలపబోవని ఆశిస్తున్నట్లు ములాయం సింగ్ అన్నారు. అణు ఒప్పందం ముస్లింలకు వ్యతిరేకమనే వాదనను ఆయన ఖండించారు.