బాబు ఢిల్లీలో ఉండడం అవసరం: బర్దన్

ద్రవ్యోల్బణాన్ని, అధిక ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించాయి. అమెరికా అనుకూల వైఖరి వల్ల దేశంలో ధరలు పెరుగుతున్నాయని, ఇతర సమస్యలు తలెత్తుతున్నాయని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అన్నారు. జపాన్ లో బుష్ తో మన్మోహన్ చర్చలు జరిపిన తర్వాత అణు ఒప్పందం ప్రక్రియ వేగవంతమైందని ఆయన అన్నారు. ధరల పెరుగుదల కన్నా బుష్ మెప్పు పొందడమే ప్రధాని మన్మోహన్ సింగ్ కు ముఖ్యమైందని ఆయన విమర్శించారు. ఐఎఇఎ ముసాయిదా బహిర్గతం కావడంపై కాంగ్రెసు సమాధానం చెప్పలేక పోయిందని ఆయన విమర్శించారు. అమెరికా విదేశాంగ విధానానికి అనుకూలంగా యుపిఎ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. బిజెపితో కలిసి 1990లో విపి సింగ్ ప్రభుత్వాన్ని కాంగ్రెసు కూల్చిందని, ఇప్పుడు తాము బిజెపితో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేస్తున్నామని విమర్శిస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications