ఢిల్లీ నేతలతో మాట్లాడుతున్నా: బాబు

Chandrababu Naidu
ఖమ్మం: ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ)కు వ్యతిరేకంగా బలపరీక్ష సమయంలో ఓటు వేసే విషయమై ఢిల్లీలోని వివిధ పార్టీల నాయకులను తాను సంప్రదిస్తున్నానని, ఆ పార్టీల నాయకులు తనతో తరుచూ మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఈ నెల 19వ తేదీన తాను ఢిల్లీకి వెళ్తున్నట్లు ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తమతో కలిసి వచ్చే పార్టీలతో కలిసి పని చేస్తానని ఆయన అన్నారు.

తాము రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టాలనుకున్నామని, కానీ తాము ప్రకటించే లోపల ముఖ్యమంత్రి ప్రకటన చేశారని ఆయన అన్నారు. తమ పాలనలో తీసుకున్న విధానాల వల్ల రాష్ట్రంలో ప్రజల ఆదాయం పెరిగిందని, రాష్ట్ర ఆదాయం పెరిగిందని, అయితే ఫలితాలు పేదలకు అందాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తాము ప్రస్తుతం ఇస్తున్న హామీలన్నింటినీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తుందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+