ప్రభుత్వ పతనం ఖాయం: వెంకయ్య

Venkaiah Naidu
హైదరాబాద్: ఈ నెల 22వ తేదీన జరిగే బలపరీక్షలో యుపిఎ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. వామపక్షాలు తమతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేయబోవడంపై కాంగ్రెసు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విరుచుకుపడ్డారు. మతతత్వాన్ని వదులుకుంటే బిజెపితో కలిసి పనిచేస్తామని ప్రకటన చేసిన వామపక్షాలపై ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కమ్యూనిస్టులు సిద్ధాంతాన్ని వదులుకుంటే వారితో కలిసి పని చేస్తామని ఆయన అన్నారు. బిజెపితో కలిసి వామపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేస్తే అపవిత్రమై పోతారన్నట్లుగా కాంగ్రెసువారు మాట్లాడుతున్నారని, గుజరాత్ లో తమతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చిందని, విపిసింగ్ ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా కూల్చిందని ఆయన అన్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+