సేతు సముద్రం ప్రాజెక్టులో మార్పు
న్యూఢిల్లీ: సేతు సముద్రం ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయ ప్రణాళికను చూస్తామని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. రామసేతును ధ్వంసం చేయకుండా మరో విధంగా ప్రణాళికను మారుస్తామని తెలియజేసింది. ప్రత్యామ్నాయ ప్రణాళికపై కోర్టు ముందు పెట్టడానికి ప్రభుత్వం సుముఖంగా ఉఁదని, ఈ విషయాన్ని కోర్టు ముందుంచాలని ప్రధాని కార్యాలయం తెలిపిందని సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్ నారిమాన్ ప్రధాన న్యాయమూర్తి కె.జి. బాలకృష్ణన్ తో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ కు తెలిపారు.
ప్రత్యామ్నాయ ప్రణాళిక కోసం టాటా ఇంధన పరిశోధన సంస్థ డైరెక్టర్ జనరల్ ఆర్.కె. పచౌరి నేతృత్వంలో ఒక నిపుణుల కమిటీని వేయాలని ప్రధాని కార్యాలయం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిటీని కోరుతారని ఆయన చెప్పారు. అన్ని విషయాలను ఈ కమిటీ పరిశీలిస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications