ఒయులో బిఇ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని లేడిస్ హాస్టల్ లో మల్లీశ్వరి అనే విద్యార్థిని బుధవారం ఆత్మహత్య చేసుకుంది. దీంతో హాస్టల్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పెద్ద యెత్తున హాస్టల్ వద్ద గుమికూడారు. విద్యార్థినిది తెనాలి స్వస్థలం. విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు అధికార వర్గాల చెబుతున్నాయి.
బి.ఇ. మూడో సంవత్సరం చదువుతున్న మల్లీశ్వరి డిటైన్ అయింది. ఒక సబ్జెక్టులో పాసు కాకపోవడంతో పై క్లాసుకు ప్రమోషన్ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు స్నేహితులు చెబుతున్నారు. తమను డిటైన్ చేయడంతో విద్యార్థులు కొంత కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ప్రైవైట్ కాలేజీల్లో ప్రమోషన్ ఇస్తుండగా ప్రభుత్వ కాలేజీల్లో డిటైన్ చేయడమేమిటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications