హైదరాబాద్:అన్ని వర్గాల వారిని కలువుకొనిపోయి రాష్ట్ర్రాభివృద్దికి పాటుపడే నాయకుడి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు.సమాజంలో మార్పును తీసుకొచ్చే రాజకీయ ప్రక్షాళన చిరంజీవితోనే సాధ్యమవుతుందని ప్రజలు భావిస్తున్నారని ,ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయాలని కోరుకుంటున్నారని చెప్పారు.సోమవారం జూభ్లిహిల్స్ లోని తన కార్యాలయంలో ఆయన జంట నగరాలకు చెందిన వివిధ న్యాయవాదుల సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు. కడుపు మండిన వారికే ఆకలి గురించి తెలుస్తుంది. ఆ విధంగానే స్వయం కృషితో నటనతో ఉన్నత శిఖరాలకు చేరిన చిరంజీవి తనను ఇంతటి వాడిని చేసిన సమాజానికి తిరిగి ఏదైనా ఇవ్వాలనే ఉద్దేశంతోనే పలు సేవా కార్యాక్రమాలను నిర్వహిస్తున్నారు. ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూసే లక్షణం మా అన్నలో లేదు.వారం ,రెండు వారాల్లో చిరంజీవి పార్టీ ప్రజలు ముందుకు రాబోతోంది. పార్టీ విధి విధానాలు ఆయన ద్వారా వింటే బాగుంటుంది.అని పవన్ అన్నారు.