పార్టీపై పెదవి విప్పిన చిరంజీవి

పార్టీ ప్రకటన చేయబోయే లోగా మరోసారి పాత్రికేయులను కలుస్తానని ఆయన చెప్పారు. ముందు హైదరాబాదులో పార్టీ ప్రకటన చేసి, తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తాను 294 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేస్తానని ఆయన చెప్పారు. తాము వచ్చే శాసనసభ ఎన్నికల్లో 225 సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లోకి రావాలని ప్రజలు చాలా కాలంగా కోరుకుంటున్నారని, వారి కోరిక మేరకే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఆయన చెప్పారు. ప్రజలు రాజకీయాల్లో కొత్త నేతను కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. పార్టీని ప్రకటించిన తర్వాత 3 నెలల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications