ఇ-మెయిల్ బెదిరింపు: హై అలర్ట్
కోల్ కత్తా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కత్తాలో హై అలర్ట్ ప్రకటించారు. కోల్ కత్తా హైకోర్టులో, ఒక ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో బాంబులు పేలుస్తామని బెదిరిస్తూ ఇండియా ముజాహిదీన్ పేర టీవీ చానెల్ కు, ఇతర మీడియా సంస్థలకు ఇ-మెయిల్ వచ్చింది. దీంతో కోల్ కత్తాలో హై అలర్ట్ ప్రకటించారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
పోలీసులు తనిఖీలు ప్రారంభించడంతో కోల్ కత్తాలో 70 శాతం వాహనాలు రోడ్లపై నుంచి మాయమయ్యాయి. కోల్ కత్తాలోని అప్ మార్కెట్ సాల్ట్ లేక్ ప్రాంతంలో గల సైబర్ కేఫ్ యజమాని కుమారుడు కౌశిక్ బోస్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మంగళవారం రాత్రంతా అతన్ని విచారించారు. బెదిరింపు ఇ-మెయిల్ పంపిన వ్యక్తి ఆనవాళ్లను తాను పోలీసులకు చెప్పినట్లు కౌశిక్ చెప్పాడు. ఈ సైబర్ కేఫ్ చట్ట విరుద్ధంగా నడుస్తోందని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications