మరోసారి పాక్ సైన్యం కాల్పులు
శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంత్రణ రేఖపై కాల్పులకు ఒడిగట్టింది. జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా సెక్టారులోని నారియా అవుట్ పోస్టుపై పాకిస్తాన్ సైనికులు బుధవారం కాల్పులు జరిపారు. పాకిస్తాన్ సైన్యం ఉదయం 11 గంటల 45 నిమిషాల ప్రాంతంలో కాల్పులు జరిపారని, భారత బలగాలు ఎదురు కాల్పులు జరపలేదని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు చెప్పాయి.
సోమవారంనాడు 15 మంది పాకిస్తాన్ సైనికులు సరిహద్దులు దాటి భారత భూభాగంలోని నౌగామ్ సెక్టారులోకి ప్రవేశించారు. ఈ ఏడాది జనవరి నుంచి 19 సార్లు పాకిస్తాన్ సైనికులు ఉల్లంఘనలకు పాల్పడ్డారని రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోనీ మంగళవారంనాడు చెప్పారు. కాల్పుల విమరణ ఒప్పందం ఉల్లంఘనలను, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులను భారత్ తీవ్రంగా పరిగణిస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications