ఎరువుల తొక్కిసలాట: రైతు మృతి
వరంగల్: ఎరువుల కోసం రైతులు ఒక్కసారిగా ఎగబడడంతో బుధవారం జరిగిన తొక్కిసలాటలో ఒక రైతు మరణించాడు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో ఎరువుల కోసం కూపన్ తీసుకుని కౌంటర్ వద్దకు పరిగెత్తుతూ పడిపోయిన ఉప్పలయ్య అనే రైతు మృతి చెందాడు. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మరణించిన రైతు కుటుంబానికి మూడు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో గత కొంత కాలంగా తీవ్ర ఎరువుల కొరత ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. రైతు మృతి నేపథ్యంలో ఎరువుల పంపిణీకి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications