ఉగ్రవాదంపై కలిసి పోరాడుదాం: మోడి

దేశమంతటికీ ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉన్నదని ఆయన అన్నారు. రెండేళ్ల కాలంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో 12 ప్రధానమైన దాడులు జరిగాయని ఆయన చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే బెంగుళూర్, ముంబయి, హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్, సూరత్ వంటి నగరాలను ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకున్నారని ఆయన అన్నారు. ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం అందించిన వారికి 21 వేల రూపాయల రివార్డు ఇస్తామని ఆయన ప్రకటించారు. కోర్ టెర్రరిస్టు నెట్ వర్క్ సమాచారాన్ని అందించిన వారికి 51 లక్షల రూపాయల బహుమతి ఇస్తామని ఆయన చెప్పారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టబోమని ఆయన చెప్పారు.
ఉగ్రవాదుల కోసం వేట సాగుతుందని, వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని ఆయన చెప్పారు. పోలీసులకు ప్రజలు బాగా సహకరిస్తున్నారని, ఈ విషయాన్ని తాను కొద్ది రోజులుగా గమనిస్తున్నానని ఆయన చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే దొంగ దాడులకు అవకాశం ఉండదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications